అక్షరటుడే, కామారెడ్డి: బీఆర్ఎస్, బీజేపీ మాయమాటలు నమ్మి మోసపోవద్దని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గెలాక్సీ ఫంక్షన్ హాల్ లో గురువారం కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. తమ ప్రభుత్వం పేద ప్రజల కోసం పని చేస్తుందని చెప్పారు. సురేష్ షెట్కార్ ను గెలిపిస్తే నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. అనంతరం పలువురు షబ్బీర్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.