అక్షరటుడే, ఇందూరు: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 29న నిర్వహించే దీక్షా దివస్‌ను సక్సెస్ చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ముఖ్య నాయకులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌పై ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, రానున్న రోజుల్లో బీఆర్‌ఎస్‌కు పూర్వ వైభవం వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో దీక్షా దివస్‌ జిల్లా ఇన్ఛార్జి ఫారుక్‌ హుస్సేన్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేష్‌ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, మాజీ జెడ్పీ ఛైర్మన్‌ విఠల్‌ రావు తదితరులున్నారు.