అక్షరటుడే, ఆర్మూర్ : నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ భర్త దండు శేఖర్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దండు శేఖర్ ను ఆయన పరామర్శించి ధైర్యం చెప్పారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆందోళన చెందవద్దని భరోసా కల్పించారు. కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.