అక్షరటుడే, కామారెడ్డి: మెస్ ఛార్జీల పెంపు బీఆర్ఎస్ పోరాట ఫలితమేనని పార్టీ యువజన విభాగం కామారెడ్డి పట్టణాధ్యక్షుడు చెలిమెల భానుప్రసాద్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గురుకుల విద్యార్థులను ఎవరెస్టు శిఖరాలను అధిరోహించేలా చేస్తే.. ఈ ప్రభుత్వం ఏడాది పాలనలో ఆస్పత్రి బెడ్లపైకి చేర్చిందని విమర్శించారు. సీఎం, మంత్రులు మొక్కుబడిగా గురుకులాలను సందర్శిస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. వెంటనే గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు రాజేశ్, మసూద్, శ్రీను, గఫార్, సాయి పాల్గొన్నారు.