అక్షరటుడే, బాన్సువాడ: మాజీ సీఎం కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఇచ్చి తామే ఉద్యోగాలు ఇచ్చామంటూ సీఎం రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారని బీఆర్ఎస్ నాయకుడు రాజారాం యాదవ్ విమర్శించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. అత్యధిక ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులు చనిపోతుంటే ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రజా పాలన సంబరాలు జరుపుకుంటుందని దుయ్యబట్టారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ జుబేర్, మోచి గణేశ్, సాయిబాబా, రమేశ్ యాదవ్, గౌస్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.