అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలపాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారు. లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి, థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించడానికి నిరసనగా మంగళవారం అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతి పత్రాలు ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు వెల్లడించారు.