అక్షరటుడే, వెబ్‌డెస్క్: కొండగట్టు ఆంజనేయ స్వామివారిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రూ.వెయ్యి కోట్లతో కొండగట్టు అభివృద్ధికి కేసీఆర్ ప్రణాళిక చేశారని గుర్తుచేశారు. అదే ప్రణాళికతో లేదంటే మరింత మెరుగైన ప్రణాళికతో కాంగ్రెస్ ప్రభుత్వం కొండగట్టును అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు పెద్దఎత్తున వచ్చే క్షేత్రంపై రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం దృష్టిపెట్టాలని సూచించారు. కొండగట్టు ఆలయ అభివృద్ధిని ఆపవద్దని ప్రభుత్వాన్ని కోరారు.