అక్షరటుడే, జుక్కల్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఈనెల 29 నిర్వహించే దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలని పార్టీ మహమ్మద్ నగర్ మండలాధ్యక్షుడు సాదుల సత్యనారాయణ పిలుపునిచ్చారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాకేంద్రంలో నిర్వహించే కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో సొసైటీ ఛైర్మన్ వాజిద్, సీడీసీ మాజీ ఛైర్మన్ గంగారెడ్డి, దఫేదార్ విజయ్‌కుమార్, మాజీ సర్పంచులు లింగాల రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.