అక్షరటుడే, హైదరాబాద్‌: కులగణనపై రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో అసమగ్రంగా జరిగిన కులగణనపై.. పార్లమెంట్ ను తప్పుదోవ పట్టిస్తారా? అని లేఖలో నిలదీశారు. అసెంబ్లీ సాక్షిగా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదని తేలిపోయిందన్నారు. లేఖలోని అంశాలు…

బీసీల జనాభాను తగ్గించి వెనకబడిన వర్గాలకు దారుణంగా వెన్నుపోటు పొడిచారని KTR ఫైర్ అయ్యారు. తప్పుల తడకగా తీసిన లెక్కలతో సర్వే పూర్తయిందనడం ముమ్మాటికీ మోసం చేయడమేన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల హామీ కూడా గ్యారెంటీల గారడీలానే మారిపోయిందన్నారు. కాంగ్రెస్ సర్కారు యూటర్న్ తీసుకోవడంతో.. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ బూటకమని తేలిపోయిందన్నారు. నమ్మంచి మోసం చేసినందుకు తెలంగాణలోని బీసీలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల్లోనే కాదు.. ఇక ఏ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ సమాజం నమ్మదని స్పష్టం చేశారు.