అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఢిల్లీ ఫలితాలపై బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ స్పందించారు. బీఆర్​ఎస్​ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాహుల్​ గాంధీ కాంగ్రెస్​ను ఒంటరిగా పోటీ చేయించి బీజేపీని గెలిపించారని ఎద్దేవా చేశారు. బీజేపీకి అతిపెద్ద కార్యకర్త రాహుల్​ గాంధీ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి అక్కడ ప్రచారం చేసి, కాంగ్రెస్​కు గుండు సున్నా తెచ్చారని వ్యాఖ్యానించారు.