అక్షరటుడే, వెబ్ డెస్క్: ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి స్వయంగా ఆటో తొలుకుంటూ బుధవారం అసెంబ్లీకి హాజరయ్యారు. అంతకు ముందు కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న 93 మంది ఆటో డ్రైవర్ల మరణాలన్నీ కూడా ప్రభుత్వ హత్యలేనని పేర్కొన్నారు.ఆటో డ్రైవర్లను ఎన్నికల కోసం వాడుకున్న ప్రభుత్వం, వారికి ఇచ్చిన హామీలన్నింటిని మర్చిపోయిందని మండిపడ్డారు. రూ.12 వేల ఆర్థిక సహాయాన్ని వెంటనే ప్రకటించాలని, సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు.