అక్షరటుడే, వెబ్​డెస్క్​: బంగ్లాదేశ్​ నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని బీఎస్​ఎఫ్​ సిబ్బంది పట్టుకున్నారు. ఢాకా నుంచి తీసుకువస్తున్న 1.745 కిలోల బరువు ఉన్న బంగారు కడ్డీలను పశ్చిమ బెంగాల్​లోని నాడియ జిల్లా సరిహద్దులో స్వాధీనం చేసుకున్నారు. ఈ పసిడి విలువ రూ.1.48కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. గోల్డ్​ స్మగ్లింగ్​ చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.