అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: దుబాయిలో బస్సు బోల్తా పడి ముగ్గురు మృతి చెందారు. ధర్వీష్‌ కంపెనీకి చెందిన బస్సు అజ్మన్‌ నుంచి కృర్పకాన్‌ వెళ్తుండగా.. ఆదివారం రాత్రి మార్గమధ్యలో బ్రేకులు ఫెయిలవడంతో బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో మొత్తం 83 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో తొమ్మిది మంది మరణించగా.. ఇద్దరు తెలంగాణకు చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.