క్యాన్సర్‌పై అవగాహన అవసరం

0

అక్షరటుడే, ఇందూరు: క్యాన్సర్‌ వ్యాధిపై అందరూ అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా జడ్జి కుంచాల సునీత, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ప్రతిమారాజ్‌ సూచించారు. వరల్డ్‌ క్యాన్సర్‌ డేను పురస్కరించుకుని శనివారం జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్యాన్సర్‌ వ్యాధి బారినపడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, తమ ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.