అక్షరటుడే, వెబ్ డెస్క్: ఆర్మూర్ దోబి ఘాట్ వద్ద శుక్రవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. ఎదురుగా వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని
అతివేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న నరేష్ అనే వ్యక్తి ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి నగేష్ ను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు అదుపుతప్పి రోడ్డు పక్కన పొదల్లోకి దూసుకెళ్లింది. ఆర్మూర్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కారు నడుపుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కాగా మృతుడితో పాటు సీరియస్ గా ఉన్న వ్యక్తి నిర్మల్ జిల్లాకు చెందిన వారిగా సమాచారం.