అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: రోడ్డు పక్కన డబ్బులు విసిరేసి ఇన్ స్టా రీల్స్ చేస్తున్న యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌ – ఘట్‌కేసర్‌ పరిధిలోని ఓఆర్‌ఆర్‌ వద్ద ఓ యువకుడు రూ.20వేలు రోడ్డు పక్కన విసిరేశాడు. దీనిని రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. వీడియో వైరల్‌గా మారి ఘట్‌కేసర్‌ పోలీసులకు చేరడంతో అతడిపై కేసు నమోదు చేశారు.