అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం నేపథ్యంలో నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఎమ్మెల్యే రామారావు పటేల్ నేతృత్వంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ మేరకు స్థానిక ఎస్ఎస్ కాటన్ లో టపాసులు కాల్చి, మిఠాయిలు తినిపించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన స్థానాల్లో కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు. రాష్ట్రంలో మహిళలకు రూ.2500 భృతి అందిస్తామని బూటకపు హామీ ఇచ్చి మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భైంసా ఏఎంసీ మాజీ ఛైర్మన్ రాజేశ్ బాబు, బీజేపీ నాయకులు సోలంకి భీంరావు, జిల్లా ఉపాధ్యక్షుడు తాలోడ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.