అక్షరటుడే, కోటగిరి: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన సందర్భంగా పోతంగల్ మండల కేంద్రంలో శనివారం నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఒకరికొకరు స్వీట్లు పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మండల అధ్యక్షుడు ప్రకాష్ పటేల్, ప్రధాన కార్యదర్శి మక్కయ్య, ఉపాధ్యక్షుడు నాగనాథ్, సీనియర్ నాయకులు బజరంగ్, పబ్బ శేఖర్, కిరణ్ సేట్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.