అక్షరటుడే, ఇందూరు/కామారెడ్డి: రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలకు గ్రంథాలయ సంస్థల ఛైర్మన్లు నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. నిజామాబాద్‌ జిల్లా ఛైర్మన్‌గా అంతిరెడ్డి రాజిరెడ్డి, కామారెడ్డి జిల్లా ఛైర్మన్‌గా మద్ది చంద్రకాంత్‌ రెడ్డిలను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.