అక్షరటుడే, ఆర్మూర్: రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో నిజామాబాద్ కీర్తిని చాటాలని ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్, ఈఆర్ ఫౌండేషన్ ఛైర్మన్, ఈరవత్రి రాజశేఖర్ అన్నారు. పట్టణంలో రాష్ట్రస్థాయి జూనియర్ బాలికల హ్యాండ్ పోటీల కోసం జిల్లా క్రీడాకారులకు నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోటీల్లో జిల్లా క్రీడాకారులు రాణించి జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం క్రీడా దుస్తుల కోసం రూ.10వేలు ఆర్థిక సాయం చేశారు. హ్యాండ్ బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గంగా మోహన్ చక్రు మాట్లాడుతూ.. ఈనెల 29 నుంచి డిసెంబర్ 1 వరకు పట్టణంలోని మినీ స్టేడియంలో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో శ్రీనివాస్, సుదర్శన్ పాల్గొన్నారు.