అక్షరటుడే, కామారెడ్డి : గాయత్రి బ్యాంక్ కామారెడ్డి శాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రమాదవశాత్తు సొప్పరి హన్మంత్ అనే ఖాతాదారుడు మృతి చెందాడు. కామారెడ్డి అర్బన్ బ్యాంకులో గాయత్రి నిర్భయ సేవింగ్స్ ఖాతాపై ప్రమాద బీమా సౌకర్యం ద్వారా రూ.లక్ష చెక్కును మంగళవారం ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి చేతుల మీదుగా మృతుని భార్య స్రవంతికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఖాతాదారులకు కనీస డిపాజిట్ తో ప్రమాదం బీమా సౌకర్యం కల్పిస్తూ అండగా నిలుస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాంచి మేనేజర్ ఈరవల్లి రాజు, సిబ్బంది పాల్గొన్నారు.