అక్షరటుడే, హైదరాబాద్: బడుగు బలహీన వర్గాలు, దళితులు, మైనారిటీ వర్గాల్లో దశాబ్దాల కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించామని సీఎం రేవంత్ అన్నారు. ఫిబ్రవరి 4 వ తేదీని గుర్తు చేసుకోవడానికి ఇకపై ఏటా ఆ రోజున “సామాజిక న్యాయ దినోత్సవం”గా జరుపుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కులగణన (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే-2024), షెడ్యుల్డ్ కులాల ప్రత్యేక వర్గాల ఉప వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికలకు శాసనసభ ఆమోదించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ కీలక ప్రకటన చేశారు.