అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను శుక్రవారం నుంచి చేపట్టనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. గురువారం ఆయన ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్ ను సచివాలయంలో లాంచ్ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునే పేదలకు రూ.ఐదు లక్షల సాయం అందజేస్తామన్నారు. 400 చదరపు అడుగుల్లో ఇల్లు కట్టుకోవాలన్నారు. అందరికీ ఇల్లు ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అత్యంత నిరుపేదలకు మొదట సాయం అందిస్తామని చెప్పారు.