అక్షరటుడే, వెబ్‌డెస్క్: వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్‌లో 18 నెలల చిన్నారి కుక్కల దాడిలో మరణించడం తనను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే పశువైద్యులు, బ్లూక్రాస్ వంటి సంస్థ ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కుక్కల నియంత్రణకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. అంతేకాకుండా శునకాలపై దాడిపై ఫిర్యాదుకు టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.