బీజేపీ బస్తీ నిద్రపై రేవంత్ విమర్శలు

0

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: బీజేపీ నేతల బస్తీ నిద్రపై సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించారు. కిషన్ రెడ్డి టార్గెట్‌గా ఘాటు విమర్శలు చేశారు. సబర్మతి ప్రక్షాళనపై కిషన్‌ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. గుజరాత్ మోడల్ దేశానికి ఆదర్శమంటున్నారు.. మూసీ ప్రాజెక్ట్‌కు మాత్రం ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు. మూసీని బాగుచేయడం బీజేపీకి ఇష్టం లేదన్నారు. మహారాష్ట్ర ప్రజలను మోసం చేసేలా షిండేను వాడుకున్నారని ఆరోపించారు. తెలంగాణలో కిషన్‌రెడ్డిని వాడుకుంటున్నారని రేవంత్ పేర్కొన్నారు.