అక్షరటుడే, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మంత్రులు, అధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో హౌసింగ్, ఇందిరమ్మ ఇళ్లపై చర్చించనున్నారు. లబ్ధిదారుల ఎంపిక, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, నిధుల కేటాయింపు తదితర అంశాలపై సమీక్షించనున్నారు.