అక్షరటుడే, ఆర్మూర్: ఆర్మూర్ సీఎస్ఐ చర్చిలో జరిగిన అక్రమాలపై ప్రశ్నిస్తే తనను చంపేస్తామని ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని చర్చి డీసీ మెంబర్ రాపల్లి ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్మూర్ ప్రెస్ క్లబ్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేవానంద్ అనే వ్యక్తి ఎస్సీ సర్టిఫికెట్‌పై ఉద్యోగం చేస్తూ చర్చి నడపగా తాను కలెక్టర్‌కు ఫిర్యాదు చేశానన్నారు. సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారని తెలిపారు. దీంతో స్టాలిన్ అనే వ్యక్తి తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని ప్రసాద్ ఆరోపించారు. సీఎస్ఐ చర్చి నుంచి నాన్ క్రిస్టియన్లను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.