అక్షరటుడే, కామారెడ్డి: పట్టణానికి చెందిన చాట్ల స్వరూప తన నాలుగేళ్ల కూతురితో సహా అదృశ్యమైనట్లు సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. స్వరూపకు ఆరేళ్ల క్రితం వివాహం కాగా నాలుగేళ్ల కూతురు ఉంది. భర్తతో గొడవల కారణంగా తన కూతురుతో కలిసి కొంతకాలంగా పట్టణంలోనే తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఈ క్రమంలో ఈనెల 4న ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె ఆచూకీ కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో స్వరూప తల్లి సిద్దవ్వ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.