అక్షరటుడే, కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు సీఐ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. గంజ్ వ్యవసాయ మార్కెట్ ఆవరణలో వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం రావడంతో సీఐ శనివారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడిది హత్యనా ఆత్మహత్యనా అనే కోణంలో విచారణ చేపడుతున్నట్లు సీఐ పేర్కొన్నారు. డీఎస్పీ నాగేశ్వర్ రావు మాట్లాడుతూ గంజ్ మార్కెట్ యార్డులో ఇద్దరు యాచకుల మధ్య గొడవ జరిగిందని, ఇందులో సాయి అనే యాచకుడు మరణించినట్లు పేర్కొన్నారు. నిందితుడిని గుర్తించి త్వరలో పట్టుకుంటామని చెప్పారు.