అక్షరటుడే, బోధన్‌: పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మద్యం తాగి వాహనం నడిపిన కేసులో ఒకరికి ఒక రోజు జైలుశిక్ష విధించినట్లు సీఐ వెంకట్‌నారాయణ తెలిపారు. కోటగిరికి చెందిన దత్తాత్రి డ్రంకన్‌ డ్రైవ్‌లో పట్టుబడగా, సోమవారం సెకండ్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరు పరిచామన్నారు. నిందితుడికి జడ్జి ఒకరోజు జైలు శిక్ష విధించినట్లు వెల్లడించారు.