అక్షరటుడే, బోధన్‌: చీటింగ్‌కు పాల్పడిన ఒకరికి బోధన్ జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ఏడాదిన్నర జైలు శిక్ష విధించినట్లు సీఐ వెంకట నారాయణ తెలిపారు. మండలంలోని కల్దుర్కి గ్రామానికి చెందిన హన్మంతుపై 2015లో రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్‌ కేసు నమోదైంది. ఆయనను కోర్టులో ప్రవేశపెట్టగా.. విచారించిన న్యాయస్థానం జైలుశిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధించినట్లు సీఐ పేర్కొన్నారు.