అక్షరటుడే, బోధన్: బోధన్ పట్టణ శివారులోని ఆటోనగర్ వద్ద పేకాట స్థావరాలపై గురువారం సాయంత్రం దాడి చేసినట్లు సీఐ వెంకటనారాయణ తెలిపారు. పేకాడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేశామన్నారు. వారి నుంచి రూ.10,500 నగదు, ఆరు బైక్లు, ఐదు ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.