అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఎన్నికల సమయంలో నంద్యాలలో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని సినీహీరో అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసు రేపు విచారణకు రానుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ అప్పటి వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి ప్రజలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. అయితే అనుమతి తీసుకోకుండా కార్యక్రమం నిర్వహించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసుపై అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు.