అక్షరటుడే, ఆర్మూర్: మండలంలోని మగ్గిడి హైస్కూల్ లో తొలగించిన మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ మండల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులతో కలిసి తహశీల్దార్, ఎంఈవో, ఎంపీడీవోలకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ కుతాడి ఎల్లయ్య, కుల్దీప్ శర్మ, జక్కం సుజాత తదితరులు పాల్గొన్నారు.