అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: నగర శివారులోని సారంగాపూర్‌లో నిర్వహించనున్న తబ్లిగి జమాతే వద్ద నగర ఫైర్‌స్టేషన్‌ సిబ్బంది రక్షణ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఫైర్‌ అధికారి పరమేశ్వర్‌ మాట్లాడుతూ సభ వద్ద ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్తగా ఫైర్‌ సిబ్బంది అందుబాటులో ఉన్నారని పేర్కొన్నారు. బందోబస్తులో స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ నర్సింగ్‌రావు, లీడింగ్ ఫైర్‌ఫైటర్‌ ఏసురత్నం, ఫైర్‌ఫైటర్‌ హరి,కిరణ్‌, పైలెట్‌ విష్ణు తదితరులు పాల్గొన్నారు.