అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ : పోలీసుశాఖలో ఇటీవల శిక్షణ పొందిన సివిల్‌ కానిస్లేబుళ్లకు ఆయా పోలీస్‌స్టేషన్లలో బాధ్యతలు అప్పగించారు. శనివారం పోస్టింగ్‌లకు సంబంధించిన ఉత్తర్వులను ఇన్‌ఛార్జి సీపీ సింధు శర్మ విడుదల చేశారు. నిజామాబాద్‌ జిల్లాకు ఏఆర్ విభాగంలో మొత్తం 126 పోస్టులకు గాను పురుషులు 87 మంది, మహిళలు 39 మంది ఉన్నారు. సివిల్ విభాగంలో మొత్తం 218 పోస్టులకు గాను పురుషులు 150 మంది మహిళలు 68 మంది పోస్టింగ్ పొందారు.