అక్షరటుడే, ఆర్మూర్‌: మోర్తాడ్‌ మండల కేంద్రంలోని రైల్వేట్రాక్‌ ప్రాంతంలోని గోదాంలో అక్రమంగా నిల్వ ఉంచిన 120 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యంను పౌరసరఫరాల శాఖ హైదరాబాద్‌ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో మంగళవారం ఆకస్మిక తనిఖీలు జరిపి అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యంను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బియ్యం నిల్వలను స్థానిక ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు తరలించారు. మోర్తాడ్ స్టేషన్లో నిందితులపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. సివిల్‌ సప్లై ఈటీఎఫ్ ఓఎస్డీ శ్రీధర్‌ రెడ్డి, అధికారులు సుదర్శన్‌ రెడ్డి, లక్ష్మయ్య, శ్రీనివాసరావు పాల్గొన్నారు.