అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఎలక్షన్​ కమిషన్​ కంటే మాజీ సీఎం జగన్​ గొప్పవాడేం కాదని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. గుంటూరులోని మిర్చి మార్కెట్​ యార్డ్​కు జగన్​ వెళ్లిన ఘటనపై స్పందిస్తూ.. ఎన్నికల కోడ్​ ఉన్నప్పుడు మార్కెట్​ యార్డ్​కు వెళ్లి.. తీరా వెళ్లాక తనకు భద్రత ఇవ్వలేదని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జగన్​ పూర్తిగా ఎన్నికల కోడ్​ను ఉల్లంఘించారని అందుకే పోలీసులు కేసు నమోదు చేశారని వివరించారు.