అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం : మండలంలోని గర్గుల్ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం సీఎం కప్ మండల స్థాయి క్రీడాపోటీలు జరిగాయి. ప్రత్యేక అధికారి తిరుమల ప్రసాద్, ఎంపీడీవో నాగవర్ధన్, ఎంఈవో ఎల్లయ్య హాజరై పోటీలు ప్రారంభించారు. ఖో ఖో పురుషుల విభాగంలో గర్గుల్ పాఠశాల విద్యార్థులు ప్రథమ, చిన్న మల్లారెడ్డి ద్వితీయ స్థానంలో నిలువగా, కబడ్డీ పురుషుల విభాగంలో చిన్నమల్లారెడ్డి ప్రథమ, గర్గుల్ ద్వితీయ స్థానంలో నిలిచారు. వాలీబాల్ పురుషుల విభాగంలో చిన్న మల్లారెడ్డి( ప్రథమ) గర్గుల్(ద్వితీయ), మహిళల ఖో ఖో,కబడ్డీ, వాలీబాల్ లో గర్గుల్ ప్రథమ స్థానంలో నిలిచారు.