అక్షరటుడే, నిజామాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంట్ నియోజకవర్గం తరపున తన అభ్యర్థిత్వాన్ని పరిగణించాలని సీఎంను కోరినట్లు లలిత తెలిపారు. అంతకుముందు గాంధీభవన్ లో నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా తన పేరును దరఖాస్తు చేసుకున్నారు. ఆమె వెంట గడిల రాములు, వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.