అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు రామర్తి గోపిని సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. నూతనంగా ఎన్నికైన యువజన కాంగ్రెస్ నాయకులతో పాటు ఆయన శనివారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక సభ్యత్వం చేయించడంలో ప్రముఖ పాత్ర పోషించిన సందర్భంగా గోపిని సీఎం ప్రత్యేకంగా ప్రశంసించారు. అలాగే యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నూతన అధ్యక్ష పదవికి పోటీ చేసిన శివచరణ్ రెడ్డి గెలుపులో కూడా గోపి కీలక పాత్ర పోషించారన్నారు.