అక్షరటుడే, వెబ్‌డెస్క్: లగచర్ల రైతు హీర్యా నాయక్‌ను గుండె నొప్పి చికిత్స కోసం సంగారెడ్డి ఆస్పత్రికి బేడీలతో తీసుకెళ్లిన ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చికిత్స కోసం బేడీలు వేసి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమిటని అధికారులను ప్రశ్నించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రజా ప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించబోదని సీఎం హెచ్చరించారు.