అక్షరటుడే, వెబ్డెస్క్: గోషామహల్లో కొత్త ఉస్మానియా ఆస్పత్రి భవన నిర్మాణానికి ఈనెల 31న శంకుస్థాపన ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణంపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆధునాతన సౌకర్యాలతో ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం చేపట్టబోతున్నామన్నారు. కార్పొరేట్ ఆస్పత్రి తరహాలో పార్కింగ్, మార్చురీ, ఇతర సౌకర్యాలు ఉండాలని దిశానిర్దేశం చేశారు. రోగులు, వైద్య సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉండేలా నిర్మాణాలు ఉండాలని సూచించారు.