అక్షరటుడే, వెబ్డెస్క్: దావోస్ పర్యటన ముగించుకొని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడానికి ఆయన దావోస్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పలు కంపెనీలతో కీలక ఒప్పందాలు చేసుకుంది. కాగా దావోస్ నుంచి వచ్చిన ముఖ్యమంత్రికి కాంగ్రెస్ నాయకులు శంషాబాద్ ఎయిర్పోర్టులో ఘన స్వాగతం పలికారు.