అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాన్ని ఇక నుంచి డిసెంబర్‌ 9న నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘తెలంగాణ తల్లి కేవలం విగ్రహం మాత్రమే కాదు.. మన ఆత్మగౌరవ ప్రతీక.. మన అస్తిత్వ పతాక.. మన జీవన గమనాన్ని నిర్ధేశించే దీపిక.. మన భవిషత్‌ కర్తవ్యాన్ని నిరంతరం గుర్తుచేసే విధాత.. అందుకే ఇకపై ప్రతియేటా డిసెంబర్‌ 9న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకుంది’ అని పేర్కొన్నారు.