అక్షరటుడే, వెబ్డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల్లో చదువుతున్న విద్యార్థులను సొంతబిడ్డల్లా చూసుకోవాలని, వారికి పరిశుభ్రమైన ఆహారం అందించేలా చూడాలని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. బడిపిల్లలకు అందించే ఆహారంలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దన్నారు. ఇటీవల కలుషిత ఆహారం కారణంగా ఓ విద్యార్థిని మృతిపట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరిగితే అధికారులు, సిబ్బందిపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిర్లక్ష్యం చేసినట్లు రుజువైతే ఉద్యోగాల నుంచి తొలగించేందుకు వెనకాడబోమన్నారు.