అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: సంధ్య థియేటర్‌ తొక్కిలాట ఘటనలో హీరో(అల్లు అర్జున్) ఒక్క రోజు అరెస్టయితే సినిమా ఇండస్ట్రీ అంతా ఆయన ఇంటికి క్యూ కట్టిందని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన బాలుడిని ఒక్క నటుడు పరామర్శించకపోవడం అత్యంత బాధాకరమన్నారు. కనీస మానవత్వం లేకుండా సినీ ఇండస్ట్రీ పెద్దలు వ్యవహరించారని పేర్కొన్నారు. “ఆ హీరోకు ఏమైనా కాలుపోయిందా.. కన్ను పోయిందా.. చెయ్యి పోయిందా.. దేనికీ ఈ పరామర్శలు” అంటూ సీఎం రేవంత్‌ ఫైర్‌ అయ్యారు. బాధిత బాలుడికి అండగా తమ ప్రభుత్వం నిలబడిందని గుర్తు చేశారు. కాగా.. సినీ ఇండస్ట్రీపై సీఎం చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.