అక్షరటుడే, వెబ్ డెస్క్: ఈ నెల 14 నుంచి సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనల్లో బిజీగా ఉండనున్నారు. ఈ నెల 14, 15న ఆస్ట్రేలియాలో సీఎం పర్యటిస్తారు. సీఎంతో సీఎస్, స్పోర్ట్స్అథారిటీ ఛైర్మన్ వెళ్ళనున్నారు. వీరు క్వీన్‌లాండ్ స్పోర్ట్స్ వర్సిటీని సందర్శిస్తారు. అనంతరం 16న సింగపూర్ వెళ్తారు. సింగపూర్‌లోని క్రీడా ప్రాంగణాలను పరిశీలిస్తారు. ఈ నెల 20 నుంచి 24 వరకు దావోస్‌లో పర్యటిస్తారు. అక్కడ జరిగే అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో పాల్గొంటారు.