అక్షరటుడే, వెబ్ డెస్క్: వ్యవసాయ భూములకు ఈ నెల 26 నుంచి రైతు భరోసా ఇస్తామని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు. ప్రతి ఎకరాకు రూ.12 వేలు అందిస్తామన్నారు. భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు కూడా రైతు భరోసా కల్పిస్తామన్నారు. ఈ పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు పెడుతున్నట్లు చెప్పారు. వ్యవసాయ యోగ్యంకాని భూములు, నాలా కన్వర్షన్‌ భూములకు రైతు భరోసా వర్తించదని స్పష్టం చేశారు. గుట్టలు, రోడ్లు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు రైతు భరోసా ఇవ్వమన్నారు. ఇందుకు గ్రామ సభల ద్వారా వివరాలు సేకరిస్తామన్నారు.