అక్షరటుడే, హైదరాబాద్‌: సీఎం రేవంత్‌ ఈరోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. పీసీసీ చీఫ్‌ మహేష్‌గౌడ్‌తో కలిసి ఢిల్లీకి సీఎం పయనం అవుతారు. ఢిల్లీలో మల్లికార్జున ఖర్గేతో భేటీ అవుతారు. కులగణన, ఎస్సీ వర్గీకరణపై చర్చిస్తారు. అయితే సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్ రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. కాగా, ఇటీవల MLAల రహస్య భేటీ నేపథ్యంలో వీరిరువురి ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ అధిష్ఠానమే పిలిపించుకుంటోందా.. లేక ఇక్కడి పార్టీ సమస్యలను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లేందుకు వారు నేరుగా వెళ్తున్నారా.. అనే చర్చ జరుగుతోంది.